కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
PLD: నకరికల్లు(M) కండ్లగుంట వద్ద గుంటూరు బ్రాంచ్ కెనాల్లో మంగళవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. కేసీపీ పవర్ ప్లాంట్-4 సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వయస్సు 30-40 ఏళ్ల మధ్య ఉంటుందని, గ్రీన్, సిమెంట్ కలర్ షర్టులు ధరించినట్లు తెలిపారు.