అలమూరులో ఉచిత వైద్య శిబిరం

అలమూరులో ఉచిత వైద్య శిబిరం

కోనసీమ: అలమూరు(మం)లో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొని రక్తపోటు, షుగర్ వంటి వ్యాధులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు.