‘బహిరంగ చర్చకు సవాల్’

‘బహిరంగ చర్చకు సవాల్’

AKP: గొలుగొండ మండలం సీహెచ్.నాగాపురంలో శ్మశాన స్థలం వివాదం ముదిరింది. మాజీ సర్పంచ్ యలమంచిలి రఘురామచంద్రరావు ఆక్రమణపై టీడీపీ కార్యకర్తల ఆరోపణలను ఖండిస్తూ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. శ్మశాన భూమిని ఆక్రమించిన వ్యక్తితో కలిసి ఫిర్యాదులు చేయడం అన్యాయమన్నారు. గతంలో అదే స్థలాన్ని ఉపయోగించారని, అధికారులు సర్వే చేసిన విషయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు.