బీఆర్ఎస్‌కు చింతకాని మండల అధ్యక్షుడు రాజీనామా

KMM: చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు తాతా మధు, నియోజకవర్గ ఇంఛార్జ్ లింగాల కమల్ రాజుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.