కాటారం ఏటీసీలలో తక్షణ అడ్మిషన్లు

కాటారం ఏటీసీలలో తక్షణ అడ్మిషన్లు

BHPL: కాటారం ఏటీసీలలో ఖాళీగా ఉన్న సీట్లకు ఈనెల 30 వరకు రోజువారీ తక్షణ అడ్మిషన్లు ఉన్నట్లు BHPL ఐటీఐ ప్రిన్సిపల్ జుమ్లా నాయక్ తెలిపారు. టాటా టెక్నాలజీ లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటీసీలు ఏర్పాటై, టాటా సంస్థ ద్వారా బోధన సిబ్బంది నియామకం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని కోరారు.