జూకు కొత్త అతిథులు: రాంచీ జూతో జంతు మార్పిడి
VSP: విశాఖపట్నం జూ పార్క్‌కు జంతు మార్పిడి విధానం ద్వారా రాంచీ జూ నుంచి కొత్త జంతువులు చేరుకున్నాయి. కొత్తగా తీసుకువచ్చిన జంతువులలో హిమాలయన్ బ్లాక్ బేర్ (నల్ల ఎలుగుబంటి), ఘరియల్ (మొసలి జాతి), స్పాటెడ్ డోవ్ (చుక్కల పావురం) , సిల్వర్ పీజియంట్ (వెండి నెమలి కోడి) ఉన్నాయి. ఈ కొత్త జంతువుల రాకతో జూ సందర్శకులకు కొత్త అనుభూతి లభించనుంది.