శ్రీ ఇరుకళల పరమేశ్వరి ఆలయ హుండీ ఆదాయం వివరాలు

శ్రీ ఇరుకళల పరమేశ్వరి ఆలయ హుండీ ఆదాయం వివరాలు

నెల్లూరులోని మూలాపేటలో ఉన్న శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో హుండీ ఆదాయం లెక్కించారు. దేవదాయ ధర్మదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రాజు పర్యవేక్షణలో అక్టోబర్ 6 నుంచి ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఇందులో భాగంగా రూ. 9,85,617 నగదు, 11 మలేషియా కరెన్సీ, 38 గ్రాముల బంగారం, 29 గ్రాముల వెండి లభించినట్లు ఆయన పేర్కొన్నారు.