మధిరలో పాము కాటుకు గురై వ్యక్తి మృతి

మధిరలో పాము కాటుకు గురై వ్యక్తి మృతి

KMM: మధిర మండలంలోని నిదానపురం గ్రామానికి చెందిన కనపర్తి శామ్యేలు పాము కాటుకు గురై బుధవారం రాత్రి మృతి చెందారు. పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శామ్యేలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.