VIDEO: నిజాంపట్నంలో బీఆర్.అంబేద్కర్‌కు నివాళులు
BPT: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ అన్నారు. నిజాంపట్నంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితుల సామాజిక, రాజకీయ, హక్కులు, భారత దేశ రాజ్యాంగ వ్యవస్థాపన, అంటరానితనం, కుల నిర్మూలకు అంబేద్కర్ ఎనలేని కృషి చేశారన్నారు.