85 మంది గర్భిణీలకు స్కానింగ్ క్యాంపు

85 మంది గర్భిణీలకు స్కానింగ్ క్యాంపు

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ సామజిక ఆసుపత్రిలో బుధవారం డా.రాంబాబు ఆధ్వర్యంలో గర్భిణీలకు స్కానింగ్ క్యాంపు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన 85 మంది గర్భిణీ మహిళలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణి చేశారు. అనంతరం వారికి పలు సలహా సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డా. విక్రమ్, జితేంద్ర, రవీందర్, తులసీదాస్, చరణ్ దాస్ పాల్గొన్నారు.