ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే

తూ.గో: గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేట గ్రామంలో టీడీపీ శ్రేణులు నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. టీడీపీ ఇంచార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ చేతులు మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది. స్వర్గీయ ఎన్టీఆర్ నిరుపేదల సమస్యలు తీర్చడానికి అహర్నిశలు కృషి చేశారన్నారు.