'ప్రజలు జాగ్రత్తలు పాటించాలి'

MNCL: భారీ వర్షాలు తగ్గేవరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జన్నారం మండల ఎస్సై గొల్లపల్లి అనూష సూచించారు. ఆదివారం ఉదయం ఆమె మాట్లాడుతూ.. భారీ వర్షాలు నేపద్యంలో వాగులు, వంకలు, చెరువులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల వైపు ప్రజలు వెళ్ళవద్దని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు.