ర్యాగింగ్ కలకలం.. 15 మంది సస్పెండ్
TG: వరంగల్ KMCలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. MBBS సెకండ్ ఇయర్ విద్యార్థుల గురించి థర్డ్ ఇయర్ విద్యార్థులు తప్పుగా వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతున్నారని.. సీనియర్లు, జూనియర్లను పిలిచి ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనపై జూనియర్ విద్యార్థులు నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు స్పందించి 15 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు.