పింఛన్ పేరుతో మోసం.. తల్లిదండ్రుల భూమి రిజిస్ట్రేషన్

పింఛన్ పేరుతో మోసం.. తల్లిదండ్రుల భూమి రిజిస్ట్రేషన్

SDPT: పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి తల్లిదండ్రుల భూమిని మోసం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన గోనెపల్లిలో వెలుగులోకి వచ్చింది. మెర్గు సిద్ధయ్యకు ఉన్న భూమిలో కొంత భాగాన్ని చిన్న కుమారుడు నగేష్ తన పేరున చేసుకున్నాడు. తాజాగా విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసి న్యాయం చేయాలని వృద్ధ దంపతులు వేడుకున్నారు.