'నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'
SKLM: ఆమదాలవలస మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం “నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీవో ఎస్ రామ్మోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి వనరుల సమర్థ వినియోగం, సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సాగునీటి సంఘాల ద్వారా రైతులకు నీటి పంపిణీ పారదర్శకంగా జరగాలని సూచించారు.