'నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు'
HNK: క్లినిక్‌లు, ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని DMHO డా. అప్పయ్య ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన గౌతమ్ హాస్పిటల్, గారిని హాస్పిటల్, అభినయ్ క్లినిక్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనుమతి పత్రాలతో పాటు తారిప్ లిస్ట్, వైద్యుల వివరాలు, ల్యాబ్‌లను పరిశీలించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.