'సెప్టెంబర్ నుంచి రూ.8 లక్షల వరకు రుణం'

TPT: సెప్టెంబర్ నుంచి ఒక్కో పొదుపు సంఘానికి సుమారు రూ.8 లక్షల వరకు రుణ పరిమితిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్త్రీనిధి మేనేజర్ మల్లేశ్వరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన జరుగుమల్లి గ్రామంలోని మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. ఈ మేరకు రుణాలు సక్రమంగా చెల్లిస్తేనే కొత్త రుణాలు తీసుకునేందుకు అర్హులని ఆయన అన్నారు.