ఈనెల 20న జాబ్ మేళా

ఈనెల 20న జాబ్ మేళా

VZM: విజయనగరం MR కాలేజ్‌లో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీద సోమవారం తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ, ATC టైర్స్, మెడ్ ప్లస్ సంస్థలలో కలిపి 195 పోస్టులు భర్తీ చేయనున్నారని, అభ్యర్థులు ముందుగా employment.ap.gov.inలో నమోదు చేసుకుని, ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటా, 2 ఫోటోలతో జాబ్ మేళాకు హాజరవ్వాలన్నారు.