ఉచిత మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఉచిత మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: కొత్తపేట మండలంలో పనిచేస్తున్న 64 మంది డ్వాక్రా యానిమేటర్లకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఉచిత మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. SHG రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి పథకాల అమలుకు, యాప్‌ల ద్వారా సర్వేలు నిర్వహించడానికి ఈ ఫోన్లు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. యానిమేటర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. రుణాలు అందరికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.