యాగంటిలో దర్శకుడు సుకుమార్ పర్యటన

NDL: యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ సోమవారం పర్యటించారు. దర్శకుడు సుకుమార్ ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో త్వరలోనే పుష్ప 3 సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నట్లు దర్శకుడు సుకుమార్ తెలిపారు.