'పథకాలు అరకొరగా ఇస్తున్నారు'
GNTR: తాడేపల్లి పరిధిలోని డోలస్ నగర్‌లో సోమవారం రాత్రి 'బాబు షూరిటీ మోసం-గ్యారెంటీ' కార్యక్రమం జరిగింది. మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలను కూడా అరకొరగా ఇస్తున్నారని ఆరోపించారు.