పోలీసులు కొట్టారని ఆత్మహత్య

పోలీసులు కొట్టారని ఆత్మహత్య

ELR: నిడమర్రు ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లు కొట్టారనే మనస్తాపంతో పురుగు మందు తాగిన వ్యక్తి మృతి చెందాడు. నిడమర్రు గ్రామానికి చెందిన నండూరి శివకుమార్(38) పురుగు మందు తాగి ఈనెల 1న తణుకులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.