నేడు ‘సురక్ష గ్రామం’ కార్యక్రమం: ఎస్సై

నేడు ‘సురక్ష గ్రామం’ కార్యక్రమం: ఎస్సై

సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ సూచనల మేరకు ‘సురక్ష గ్రామం’ కార్యక్రమం అమలులో భాగంగా బెజ్జంకిలో అవగాహన సమావేశం నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెజ్జంకిలో జరిగే ఈ సమావేశానికి సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డ్ సభ్యులు, ఉద్యోగులు, ప్రజలు హాజరుకావాలని ఎస్సై సౌజన్య కోరారు. గ్రామ భద్రత కోసం అందరూ భాగస్వామ్యం కావాలన్నారు.