బ్యాంక్ కీలక నిర్ణయం.. తగ్గనున్న EMI భారం
ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్ తన MCLRను 5 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఈ సవరించిన రేట్లు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో బ్యాంక్ అందించే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై EMI భారం తగ్గనుంది. ఏడాది MCLRను 8.75% నుంచి 8.70 శాతానికి తగ్గించారు. ఓవర్‌నైట్ రేటు 7.95% నుంచి 7.90 శాతానికి తగ్గింది. రెండేళ్లది 8.85%, మూడేళ్లది 8.90%గా ఉంది.