ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

KRNL: ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆలూరు MLA బుసినే విరుపాక్షి ఇవాళ తనిఖీ చేశారు. గత టీడీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి అప్పుడే పెచ్చులూడి పడిపోవడం దుర్మార్గమన్నారు. ఆసుపత్రి భవనం నిర్మించిన 6 సంవత్సరాలకే ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకోవడం దురదృష్టకరమన్నారు. DMHO ఇప్పటికైనా స్పందించి ఆసుపత్రిని పరిశీలించాలన్నారు.