రేపు AU ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష

AP: రేపు ఆంధ్రా యూనివర్సిటీ(AU) ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు 5,948 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు పరీక్ష జరగనుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రితో పాటు.. విజయవాడ, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో నిర్వహించనున్నారు.