'అర్ధరాత్రి వేళ ఆశ వర్కర్ల అరెస్టు అప్రజాస్వామికం'
ASF: ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని CITU జిల్లా సహాయ కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి విమర్శించారు. ఆదివారం సిర్పూర్ మండల కేంద్రం బస్టాండ్ వద్ద నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడుతూ.. ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అర్ధరాత్రి వేళ ఆశ వర్కర్లను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.