దుర్గమ్మ సన్నిదిలో ఇరుముడి కార్యక్రమం
NTR: విజయవాడలో ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిన్న భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. భవానీ దీక్షాధారులు వేకువ జామున 3 గంటల నుంచి గిరిప్రదక్షిణ పూర్తి చేసుకొని సీతమ్మ వారి పాదాల సెంటర్ సమీపంలోని కంపార్టుమెంట్స్‌కు చేరారు. అనంతరం క్యూలైన్లో వేచి ఉన్న దీక్షాధారులకు అమ్మవారి దర్శించుకుని, గురు భవానీల సమక్షంలో ఇరుముడులు సమర్పించారు.