ధ్వంసం అయిన పంటలను పరిశీలించిన టీడీపీ ఇంఛార్జ్
మన్యం: ఏనుగులు గుంపు ధ్వంసం చేసిన రైతుల పంటలను పాలకొండ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ పడాల భూదేవి సోమవారం పరిశీలించారు. భామిని మండలం బిల్లుమడలో ఏనుగులు గుంపు ధ్వంసం చేసిన రైతుల పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అదైర్య పడొద్దని, ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పరిహారం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.