సమ్మె బాటలోనే ఇంజనీర్ కార్మికులు

NTR: రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెబాట 4వ రోజుకు చేరింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 29 మంది సమ్మెలో పాల్గొన్నారు. కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పారు.