VIDEO: శాంతిఖని గనిలో అస్వస్థతకు గురైన కార్మికుడు

VIDEO: శాంతిఖని గనిలో అస్వస్థతకు గురైన కార్మికుడు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శాంతిఖని గనిలో ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన చెన్నూరి ప్రదీప్ అనే జనరల్ మజ్దూర్ కార్మికుడిని బుధవారం అధికారులు అండర్ గ్రౌండ్‌లో పనికి పంపించారు. దీంతో గని లోపల కార్మికుడు అస్వస్థతకు గురి అయ్యాడు. గని అధికారులు సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా కార్మికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు