VIDEO: జగ్గయ్యపేటలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
NTR: జగ్గయ్యపేటలో CM చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ, అన్నదానం చేపట్టారు. అన్న క్యాంటీన్ సేవలను కొనియాడుతూ, పేదలకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.