'రేపటి కార్మిక సమ్మెను జయప్రదం చేయండి'

'రేపటి కార్మిక సమ్మెను జయప్రదం చేయండి'

NLG: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని నల్గొండ CITU మండల కన్వీనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకువచ్చిన 4 కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.