యుద్ధం ఎఫెక్ట్.. వంటింటిపై భారం..!
BPT: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వంటింటిపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు ధరలు పెరగగా.. వంట నూనె ధరలు అదే రీతిలో ఉన్నాయి. బాపట్ల, రేపల్లె, చీరాల పురపాలక సంఘాలతో పాటు 20 మండలాల్లో నూనె ధరలు పెరిగాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతి కుటుంబంపై నెలకు రూ. 90 పెరగనుంది. ఈ రకంగా నిత్యవసర సరుకులు పెరుగుతుండడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది.