'మంచినీటికి శాశ్వత పరిష్కారం చూపండి'
BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ సత్యనారాయణకు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 44వ డివిజన్ గాంధీనగర్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వేసవికాలంని దృష్టిలో పెట్టుకుని శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.