అప్పు అడిగినందుకు చాకుతో దాడి: ఎస్సై

అప్పు అడిగినందుకు చాకుతో దాడి: ఎస్సై

BPT: అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఒక వ్యక్తిపై చాకుతో దాడి చేసిన ఘటన వరాహపురంలో జరిగింది. గ్రామానికి చెందిన దేవరాజు, కోటికి రూ.10 వేలు అప్పు ఇప్పించాడు. అప్పు తిరిగి ఇవ్వమని అడగగా, కోటి చాకుతో దేవరాజుపై దాడి చేశాడు. గాయపడిన దేవరాజును తెనాలి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.