'వనపర్తిలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయండి'
WNP: జిల్లా కేంద్రంలో ప్రజాగాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మొలకలపల్లి మద్దిలేటి కోరారు. సోమవారం 'ప్రజావాణి'లో జిల్లా అదనపు కలెక్టర్ యాదయ్యకు వినతిపత్రం సమర్పించారు. గద్దర్ సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం అభినందనీయమన్నారు.