VIDEO: ప్రారంభం కానున్న జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్
VZM: ప్రతి నెల జరిగే జిల్లా స్థాయి టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం శాప్ లీగ్స్ చెస్ టోర్నమెంట్‌ను రాజీవ్ స్టేడియం నందు నిర్వహించనున్నట్లు DSDO ఎస్.వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ పోటీలకు అండర్ 13,15,17,19 వయసు గల బాల, బాలికలు అర్హులన్నారు. గెలుపొందిన విజేతలు తిరుపతిలో జరగబోయే రాష్ట్ర క్రీడా పోటీలకు విజయనగరం వీరాస్ అనే సింబల్‌తో పాల్గొనున్నట్లు ఆయన పేర్కొన్నారు.