ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ఏలూరు జిల్లా టీ.నర్సాపురంలోని బొర్రంపాలెంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సోమవారం జరిగింది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో బుడుపుల ప్రసాద్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.