ఇద్దరు పిల్లలు అదృశ్యం.. తల్లిదండ్రుల ఆవేదన

ఇద్దరు పిల్లలు అదృశ్యం.. తల్లిదండ్రుల ఆవేదన

VKB: ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన తాండూర్‌లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాలు.. తాండూరు బాలుర తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి హర్షవర్ధన్, వినయ్ అనే విద్యార్థులు అదృశ్యమయ్యారు. దీంతో పాఠశాల వద్ద వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదించారు. అదృశ్యమైన బాలుర ఆచూకీ తెలుసుకోవాలని, సురక్షితంగా తమకు అప్పగించాలని పోలీసులను కోరారు.