'శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చర్యలు తప్పవు'
ASF: శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కౌటాల సీఐ బి సంతోష్ కుమార్ అన్నారు. ఆదివారం బెజ్జూరు మండలలో పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌటాల సీఐ మాట్లాడుతూ.. ఎన్నికల ఆదేశాలను అందరూ కచ్చితంగా పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగితే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.