నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడి

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడి

NDL: నందికొట్కూరు పట్టణంలోనీ నీలి షికారి కాలనీలో శుక్రవారం ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌, అర్బన్‌ పోలీస్ సిబ్బంది అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ వి.రాముడు ఆధ్వర్యంలో మూకుమ్మడి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 3,180 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అలాగే 35 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్ట్ చేశారు.