ఉరి వేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

ప్రకాశం: ఒంగోలులోని ఓ కళాశాలకు చెందిన బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. హాస్టల్లోని గది నుంచి దుర్వాసన రావడంతో విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే విద్యార్థి ఉంటున్న గదిని తెరిచి చూడగా ఉరివేసుకొని విద్యార్థి మృతి చెంది కనిపించాడు.