5వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు
MNCL: భీమారం మండలంలోని ఆర్కెపల్లి ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు బుధవారం వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం దరిపెల్లి స్వరూప మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతస్థితికి చేరుకుని భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని సూచించారు. ఎంఈవో శ్రీనివాస్, ఉపాద్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.