కారును తప్పించబోయి ఫైరింజిన్ బోల్తా

KRNL: ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ఫైరింజిన్ బోల్తా పడిన ఘటన ఎమ్మిగనూరు మండలం కోటేకల్ దగ్గర మంగళవారం చోటుచేసుకుంది. ఆదోని నుంచి ఫైరింజిన్ మంత్రాలయం వెళ్లి తిరిగి వస్తుండగా కోటేకల్ దగ్గర ఎదురుగా నిర్లక్ష్యంగా వస్తున్న కారును తప్పించబోయి రోడ్డు పక్కనున్న కరెంట్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.