ఊర గుట్టను గ్రామానికి కేటాయించాలని వినతి
JGL: భీమారం మండల కేంద్రంలోని ఊరగుట్టను అటవీశాఖ నుంచి గ్రామానికి కేటాయించాలని కోరుతూ మంగళవారం రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ కిరణ్‌కు గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెక్కపల్లి స్వాతి, సంజీవ్, ఉప సర్పంచ్ పరమేశ్, వార్డు సభ్యులు వెంకటేశ్, వీడీసీ ఉపాధ్యక్షుడు నర్సయ్య, ఏలేటి సతీశ్, కల్లెడ వినయ్, చెక్కపల్లి విజయ్, రంజిత్ పాల్గొన్నారు.