అడ్డాకులకు పెరిగిన గిరాకీ!
ASR: మన్యంలో అడ్డాకులకు మంచి గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం జీ.మాడుగుల మండలంలో జరిగే వారపు సంతల్లో గిరిజనులు తెచ్చిన అడ్డాకులకు దిండికి రూ.1000 నుంచి రూ.2వేలు వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వేసవి సెలవులకు స్కూళ్ల నుంచి ఇళ్లకు వచ్చిన విద్యార్థులు సైతం అడవిలోకి అడ్డాకులను సేకరిస్తున్నారు. తల్లిదండ్రులకు వారు చేదోడువాదోడుగా ఉంటున్నారు.