VIDEO: వైభవంగా శని పరిహార పూజలు

VIDEO: వైభవంగా శని పరిహార పూజలు

TPT: నాగలాపురం మండలం సురుటపల్లి గ్రామంలోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శనీశ్వర స్వామికి శని పరిహార పూజలు వైభవంగా నిర్వహించారు. విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన కార్యక్రమంలో నవగ్రహ కలశ పూజలు, 27 నక్షత్రాల హోమం, 12 రాశుల హోమం, నవగ్రహ అభిషేకం, పూర్ణాహుతి, మహాదీపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూరపాటి శంకర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.