ఏకగ్రీవంగా టీడీపీ గ్రామ కమిటీల ఎంపిక

ఏకగ్రీవంగా టీడీపీ గ్రామ కమిటీల ఎంపిక

చిత్తూరు: చిత్తూరు రూరల్ మండలంలో టీడీపీ గ్రామ కమిటీల ఎన్నికలు గురువారం ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల పరిశీలకులు మారుతి పర్యవేక్షణలో.. రూరల్ పరిధిలో నాయని చెరువు, తుమ్మిందపాళ్యం, తొప్పాతిపల్లి, పెద్దిశెట్టిపల్లి, చెర్లోపల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామ కమిటీ సభ్యులను స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.