VIDEO: బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం: మాజీ Dy. CM

JN: బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం చిల్పూరు మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఆయన పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి సాధించిందని అన్నారు.